సామాజిక మార్పును ప్రోత్సహిస్తున్న MG సేవ

–  70,000 మహిళలకు & బాలికలకు సాధికారత కల్పన గత ఏడాదిగా 1.2 లక్షల లబ్దిదారులు

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో ఆటోమోటివ్ దృశ్యంలో JSW MG మోటార్ ఇండియా ప్రసిద్ధి చెందిన పేరు. ఇది తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం, MG సేవ’ ద్వారా సామాజిక మార్పును ప్రోత్సహిస్తోంది. కంపెనీ యొక్క మొదటి కారు ప్రారంభమవడానికి ముందే  ప్రారంభమైన ఎంజి సేవ సంప్రదాయబద్ధమైన హద్దులను మార్చే సామాజిక ఉన్నతి యొక్క కలను చిహ్నంగా నిలుస్తుంది. బాలికల చదువుకు మరియు మహిళల సాధికారతకు ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తూ ఎంజి సేవ విద్య మరియు పరిశుభ్రతలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. కేవలం 2024లోనే, ఈ కార్యక్రమం 1.2 లక్షల లబ్దిదారుల జీవితాల పైన సానుకూలమైన ప్రభావం చూపించింది. వారిలో 70,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఆధునిక సాధనా అవకాశాలు పొందడానికి వీలు కల్పించడం ద్వారా, ప్రారంభపు అక్షరాస్యతను ప్రోత్సహిస్తోంది మరియు అమ్మల చదువుకు మద్దతునిస్తోంది. ఎంజి సేవ అభిలాషలను ప్రోత్సహిస్తోంది మరియు యువ మహిళలు మరియు వారి కుటుంబాలలో సంభావ్యతకు అవకాశం అందిస్తుంది. కార్యక్రమం యొక్క సమగ్రమైన అభివృద్ధి విధానం చదువును మాత్రమే కాకుండా వ్యక్తిగత అభివృద్ధి, సమాజంలో ఆరోగ్యం మరియు సమీకృతం చేయడం వంటి కీలకమైన అంశాలను కూడా పరిష్కరిస్తోంది. కేంద్రీకృత జోక్యాలు విలక్షణమైన అవసరాలు కలిగిన పిల్లల కోసం సమీకృత అవకాశాలను కలిగిస్తాయి, తమ విద్యా ప్రయాణాలలో మరియు అంతకు మించి  వర్ధిల్లి, విజయం సాధించడానికి సాధికారత కలిగిస్తాయి.

      ఎంజి సేవ యొక్క సిద్ధాంతం మరియు మూలాలు దీనిని ప్రత్యేకంగా నిలిపాయి. ఎన్నో కార్పొరేట్ కార్యక్రమాలు వలే కాకుండా  ఎంజి సేవ ఆదేశిత CSR టీమ్ లేదా బాధ్యతలు లేకుండా  మిషన్-ప్రోత్సాహిత ప్రయత్నంగా మాత్రమే స్థాపించబడింది. వ్యాపారాలు ప్రభావవంతమైన సామాజిక మార్పుకు స్వచ్ఛందంగా తోడ్పడతాయని JSW MG మోటార్ ఇండియా వారి నమ్మకాన్ని ఈ విధానం ప్రదర్శిస్తోంది. WASH (వాటర్, శానిటేషన్ మరియు హైజీన్) వంటి కార్యక్రమాలు ద్వారా, ఎంజి సేవ ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఉన్న ప్రాంతాల్లో బహిష్టు పరిశుభ్రతను ప్రోత్సహించడం ద్వారా 16,730 మంది మహిళలు మరియు బాలికల జీవితాలలో సానుకూలమైన ప్రభావం కలిగించింది. 100కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని గిరిజనుల స్థానిక భాషలకు అనుగుణంగా రూపొందించబడిన వినూత్నమైన పద్ధతులను వినియోగించి  ఎంజి సేవ విద్యా కార్యక్రమాలు గణితం అందుబాటులోకి తెచ్చాయి. ఈ కొనసాగుతున్న కార్యక్రమాలు 80,000కి పైగా పిల్లలకు చేరుకున్నాయి, వీరు విద్యాపరమైన అడ్డంకులను అధిగమించేలా వారికి సాధికారత కలిగించాయి.
ఎంజి సేవ ప్రయాణాలు లబ్దిదారులకు మార్గదర్శకత్వంవహించి మరియు సలహాలు ఇవ్వడానికి తమ పని వేళలకు మించి శ్రమించిన JSW MG మోటార్ ఇండియా వారి ఉద్యోగుల యొక్క అంకితభావంతో ప్రోత్సహించబడ్డాయి. వారు వ్యక్తిగతంగా పిల్లలు మరియు మహిళలతో నిమగ్నమై, పరస్పర జోక్యాలు, సలహాలు అందిస్తూ, కార్యక్రమాలను కొనసాగించడానికి క్రౌడ్-ఫండింగ్ మద్దతు కూడా అందించారు. లోతైన, వ్యక్తిగత మరియు దీర్ఘకాల ప్రభావాలను నిర్థారించిన ఈ ప్రత్యక్షమైన విధానం ఎంజి సేవను ప్రత్యేకంగా నిలిపింది. ఎంజీ డీలర్ భాగస్వాములు తమ డీలర్ షిప్ ఆపరేషన్ లకు మించి తమ మద్దతును విస్తరించడం ద్వారా ఈ మిషన్ ను విస్తృతం చేయడంలో కీలకమైన బాధ్యతవహించారు. వారు నిధులు సమకూర్చడం, కార్యక్రమంలో పాల్గ1నడం మరియు సేవలు అందని ప్రజల కోసం నేరుగా సంరక్షణవహించడం ద్వారా చురుకుగా తోడ్పాటు అందించారు. కలిసికట్టుగా, ఉద్యోగులు మరియు డీలర్ భాగస్వాములు ఎంజి సేవ యొక్క కీలకమైన సిద్ధాంతంతో అనుసంధానం చెందిన అర్థవంతమన సామాజిక మార్పు యొక్క సంస్కృతిని ప్రోత్సహించారు. ఎంజి సేవ తమ చేరిక విస్తరణను కొనసాగిస్తుండటం వలన, దీని ప్రతిష్టాత్మకమైన లక్ష్యం స్పష్టంగా ఉంది: ఆలోచనాత్మకమైన మరియు ప్రబావవంతమైన కార్యక్రమాల ద్వారా వ్యవస్థాపరమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా మరింత లక్షలాది మందికి సాధికారత కల్పించడం.

       ఈ కార్యక్రమం గురించి వ్యాఖ్యానిస్తూ, రాజీవ్ ఛాబా, సిఇఓ ఎమరైటస్ ఇలా అన్నారు, “కమ్యూనిటీ అనేది JSW ఎంజి మోటార్ ఇండియాలో కీలకమైన బ్రాండ్ మరియు ప్రజల గురించి మా శ్రద్ధ అనేది మా కస్టమర్లను మరియు ఉద్యోగులను మించింది. సేవ అనేది మా స్వచ్ఛంద సమాజ సేవా కార్యక్రమం. ఇది మా మొదటి కారు విడుదలవడానికి ముందే రూపొందించబడింది. మహిళా సాధికారత మరియు బాలికల చదువు రంగాల్లో సానుకూలమైన ప్రభావం కలిగించే లక్ష్యంతో, మేము గత ఏడాది దేశవ్యాప్తంగా 70,000 మంది మహిళలకు మద్దతు ఇచ్చాము. మా కల సాధారణమైనది కానీ శక్తివంతమైనది- “ మేము విక్రయించే కార్ల సంఖ్య అంత మహిళలకు మద్దతు చేయడం“. మేము అందరి కోసం  అర్థవంతమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు ఉజ్జ్వలమైన, మరింత సమానమైన భవిష్యత్తును ప్రోత్సహించడానికి కృషి చేస్తాం.” MG సేవ సమగ్రమైన అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించే కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా అర్థవంతమైన సామాజిక ప్రభావాన్ని సృష్టించడానికి  JSW MG మోటార్ ఇండియా వారి నిబద్ధతను సూచిస్తోంది. బాలికా విద్య మరియు మహిళల చదువు, ఆరోగ్యం, పరిశుభ్రతలు మరియు  సమగ్రమైన సంక్షేమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సానుకూలమైన మార్పును ప్రోత్సహించడానికి తమ కీలకమైన కార్యకలాపాలను మించి  ఏ విధంగా వ్యాపారాలు కొనసాగుతాయి అని ఎంజి సేవ ప్రదర్శిస్తోంది. నమ్మకమైన భాగస్వాములతో సహకరించడం ద్వారా, ఈ కార్యక్రమం సమాజాలకు సాధికారత కల్పించడానికి మరియు ఉజ్జ్వలమైన, మరింత సమీకృత భవిష్యత్తు కోసం అవకాశం కల్పిస్తోంది, అభివృద్ధి మరియు అవకాశం కోసం శక్తివంతమైన పునాదిని రూపొందించడానికి ప్రతి ప్రయత్నం తోడ్పడటాన్ని నిర్థారిస్తోంది.