ఎంజి విండ్సర్‌ రికార్డ్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ : జెఎస్‌డబ్ల్యు ఎంజి మోటార్‌ ఇండియా తన నూతన కారు ఎండి విండ్సర్‌ అమ్మకాల్లో రికార్డ్‌ను నమోదు చేసినట్లు తెలిపింది. 2024 అక్టోబర్‌లో 3,116 యూనిట్ల విండ్సర్‌ అమ్మకాలు చేయగా.. తమ ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ కార్లు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయని తెలిపింది. గతేడాది ఇదే మాసంతో పోల్చితే 31 శాతం వృద్థితో మొత్తంగా 7,045 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిపింది. ఎంజి మోటార్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇదే రికార్డ్‌ విక్రయాలని తెలిపింది.ూ