క్రీడారంగంలో ఎంజీయూ విద్యార్థులు రాణించాలి

నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఎంజీయూ విద్యార్థులకు అన్ని క్రీడా సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయిలో రాణించాలని ఎంజి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్‌ రెడ్డి కాంక్షించారు.2023-24 విద్యా సంవత్సర స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ ను గురువారం యూనివర్సిటీలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం మొత్తం 20 కేటగిరీల్లో, పురుషులకు 19, మహిళలకు 15, మొత్తం 34 అంశాల్లో పోటీలు నిర్వహించి, అంతర కళాశాల, అంతర విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 27 నుండి జనవరి 8 2024 వరకు పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య తుమ్మ కష్ణారావు, ఓ ఎస్‌ డి ఆచార్య అల్వాల రవి, ఈసీ మెంబర్‌ డా ఆకుల రవి, స్పోర్ట్స్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి ఉపేందర్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ కె అరుణప్రియ, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా మద్దిలేటి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా మురళి పాల్గొన్నారు.