వాణిజ్య వాహన టైర్ మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z+ ను ఆవిష్కరించిన మిచెలిన్.

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలోని టైర్ టెక్నాలజీ లీడర్ అయిన మిచెలిన్ తన అత్యంత ఇంధన-సమర్థవంతమైన ట్రక్, బస్ టైర్ మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z+ని భారత మార్కెట్ కోసం విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. మేడ్-ఇన్-ఇండియా టైర్ యొక్క ఈ తాజా శ్రేణి భారతీయ రహదారి, లోడ్ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందిం చబడింది. భారతీయ ఫ్లీట్ యజమానుల నుంచి ఇంధన – సమర్థవంతమైన టైర్లకు పెరుగుతున్న డిమాండ్ ను కూడా సంస్థ ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది. మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z+ టైర్ టెక్నాలజీలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఇది పరిశ్రమ యొక్క అత్యల్ప రోలింగ్ నిరోధకతను కలిగి ఉంది. ఇది 15% వరకు ఇంధన పొదుపును అందిస్తుంది. ఈ ట్యూబ్‌లెస్ ట్రక్ టైర్ 295/80R22.5 పరిమాణంలో ఉంటుంది. ఇది ప్రశంసలు పొందిన మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z అప్‌గ్రేడ్ వెర్షన్. CO2 ఉద్గారాలను 8 టన్నుల వరకు తగ్గించడంలో సహాయం చేయడానికి రూపొందించబడింది. “2020లో ముందుగా X మల్టీ ఎనర్జీ Z శ్రేణిని విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, మా భారతీయ కస్టమర్ల కోసం రేపటి తరం మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z+ శ్రేణిని తీసుకువస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం” అని మిచెలిన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శంతను దేశ్‌పాండే అన్నారు. ‘‘లాజిస్టిక్స్‌ లో అధిక ఇంధన వ్యయాలే ప్రధాన సమస్య ఫ్లీట్ యజ మానుల నిర్వహణ ఖర్చులలో 60% దాకా ఇదే ఉంటుంది. మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z+ ఈ సమస్యను పరిష్కరి స్తుంది. ఇది అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందించడం ద్వారా వారి మొత్తం ఖర్చులను తగ్గించడానికి దోహద పడుతుంది’’ అని అన్నారు. మిచెలిన్ కు సంబంధించి సుస్థిరమైన భవిష్యత్తు, సాంకేతికతలో పురోగతులు చెట్టపట్టాలు వేసుకొని ఉంటాయి. పర్యావరణం పట్ల గౌరవం అనేది సంస్థకు గల దీర్ఘకాల నిబద్ధత. మిచెలిన్ ఐదు ప్రధాన విలువలలో అది ఒకటి. 30 సంవత్సరాలకు పైగా, ఈ గ్రూప్ తన పర్యావరణ పాదముద్రను తగ్గించడానికి మరియు తక్కువ ప్రభావంతో పెరుగుతున్న వినూత్న ఉత్పత్తులు, సేవలు, పరిష్కారాలను రూపొందించే సామర్థ్యాన్ని పెంచడానికి తన సుముఖతను ప్రదర్శించింది. టైర్లకు సంబంధించి మిచెలిన్ 1992 నుండి “గ్రీన్” టైర్‌ను ప్రారంభించడంతో దీనికి మార్గం చూపింది. మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z+ CO2 ఉద్గారాలను 8 టన్నుల వరకు తగ్గించడంలో సహాయం చేస్తుంది.**ఇది 2030 నాటికి మిచెలిన్ గ్రూప్ యొక్క CO2 ఉద్గార తగ్గింపు కట్టుబాట్లకు గణనీయంగా దోహదపడుతుంది. ఈ టైర్ శ్రేణి ప్రస్తుతం అన్ని అధీకృత మిచెలిన్ ఇండియా డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంది