మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె..

– ప్రారంభం అయిన ఎం.డి.ఎం కార్మికుల సమ్మె
– సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్,యూటీఎఫ్ నాయకులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయి బిల్లులు,వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని,కనీస వేతనం రూ .26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజనం యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక యం.ఆర్.సి వద్ద సోమవారం సమ్మె నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ పేద పిల్లలకు పాఠశాలలో వంట వండి పెడుతున్న వంట కార్మికుల బ్రతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయని,వంటకు పెట్టిన పెట్టుబడులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విద్యా సంవత్సరం నుండి కొత్త మెనూ ప్రభుత్వం తీసుకువచ్చి వంట కార్మికులు అమలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని,మార్కెట్లో కూరగాయల ధరలు ఇతర నిత్యవసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగిన ఈ సందర్భంలో విద్యార్థుల మెనూ చార్జీలు పెంచకుండా ఎలా కొత్త మెనూ అమలు చేస్తారు అని ప్రశ్నించారు.వంట కార్మికులు పెట్టిన ఎదురు పెట్టుబడి డబ్బులు నెలల తరబడి ప్రభుత్వం విడుదల చేయని కారణంగా వడ్డీలు పెరిగి పోతాన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వంట కార్మికులకు రూ. 2 వేలు పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా నేటికీ పెరిగిన వేతనాలు ఇవ్వలేదని దుయపట్టారు.వంట కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని, విద్యార్థులకు మెనూ చార్జీలు పాతిక రూపాయలు పెంచాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రెండు జతల కాటన్ యూనిఫామ్ ఇవ్వాలని, సబ్సిడీతో గ్యాస్ అందించాలని,గుడ్డు కు అదనపు బడ్జెట్ కేటాయించాలని ఈ నెల 10, 11 ,12 తేదీలలో మూడు రోజుల పాటు పాఠశాలలో వంట నిర్వహణ బంధు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమ్మె కు మద్దతు కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ,యూటియఫ్ జిల్లా కార్యదర్శి మడివి కృష్ణారావు,రావుల రాముడు, సుబ్బారావు,మధ్యాహ్నం భోజనం యూనియన్ నాయకులు యామిని, మురళి,పద్మ, నాగ దుర్గ,సీత, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.