మధ్య తరగతి ఫ్యామిలీ ఘర్షణలు

Middle class family conflictsసాయిజా క్రియేషన్స్‌ పతాకం పై చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమాదేవి, శరత్‌ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్‌ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ని హీరో రాజ్‌ తరుణ్‌ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’పోస్టర్‌, టైటిల్‌ చూడగానే చాలా పాజిటివ్‌గా బాగుందని పించింది. మంచి ఫ్యామిలీ చిత్రంగా ‘సారంగ దరియా’ సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. నిర్మాత శరత్‌ చంద్ర మాట్లాడుతూ, ‘మా ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేసిన హీరో రాజ్‌ తరుణ్‌కి చాలా థ్యాంక్స్‌ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.
డైరెక్టర్‌ పద్మారావు అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ,’ సినిమా ఇంత బాగా రావడానికి సపోర్ట్‌ చేసిన రాజా రవీంద్రకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కాదంబరి కిరణ్‌, హర్షవర్ధన్‌ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – అరుణాచల మహేష్‌ డైలాగ్స్‌-వినరు కొట్టి, ఎడిటర్‌ – రాకేష్‌ రెడ్డి, సంగీతం – ఎం.ఎబెనెజర్‌ పాల్‌, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు, లిరిక్‌ రైటర్స్‌ – రాంబాబు గోశాల కడలి సత్యనారాయణ.