
మధ్య తరగతి ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వ్యాపార ఉద్యోగ వర్గ ప్రజలు గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల కుటుంబాలకు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించడం అభినందనీయమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు… పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద గల గాయత్రి బ్యాంకు ఖాతాదారుడైన ఏనుగు సాయన్న ప్రమాదవశాత్తు మరణించగా ఆయన భార్య ఏనుగు లక్ష్మికి బుధవారం లక్ష రూపాయల చెక్కును అందజేసినారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామమాత్రపు చార్జీలతో లక్ష రూపాయల ప్రమాద బీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామోజీ లింబాద్రి మాట్లాడుతూ ఖాతలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో, జిరాక్స్లను బ్యాంకు యందు ఉచితంగా అందిస్తున్నామని ,పరిసర గ్రామాలలో 17 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించినమని ,పెన్షనర్లు ఇతర ఖాతాదారులు ఇట్టి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వర్తించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బి జె పి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.