విజయ్ దేవరకొండ నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్‌ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది క్షణాల్లోనే టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్‌ని గమనిస్తే ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ రాముడిగా విజరుదేవరకొండ పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రలు, సన్నివేశాల సమాహారం మొత్తంగా సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి అని చిత్ర బృందం తెలిపింది.