కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: మండల కేంద్రనికి చెందిన వారు సుమారు 50 కుటుంబాలు  కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. వీరికి ఎంపీపీ పార్టీ ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై కాంగ్రేస్ పార్టీను విడి అధికార పార్టీలోకి చేరడం జరగిందని తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరడం చాలా సంతోషకరమైన విషయం అని మీకు పార్టీ తరఫున ఎల్లా వేళలా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గుండె రావు పటేల్, బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కండరావ్ పటేల్, నర్సు పటేల్, రమేష్, ప్రేమ్ సింగ్, బౌసింగ్, బలరాం, సాయిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.