ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి వలసలు

నవతెలంగాణ-జహీరాబాద్‌
జహీరాబాద్‌ ఎమ్మెల్యే కే.మాణిక్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా జహీరాబాద్‌ మున్సిపాల్టీ, హాతీ(కే) తాండాకు చెందిన సుమారు 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో బుధy ారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో రైతులకు, పేదలకు సీఎం కేసిఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జహీరాబాద్‌ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్న తీరు పట్ల సంతప్తిని స్తున్నదన్నారు. నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను మరోమారు భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెవరైజేస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ దేవి ప్రసాద్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ గుండప్ప, మాజీ ఎంపీపీ విజయ కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ మహంకాల్‌ సుభాష్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు మెంబర్‌ శంకర్‌ నాయక్‌, మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు హీరో రాథోడ్‌, సర్పంచ్‌ గోపాల్‌, కోహిర్‌ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్‌, మాజీ సర్పంచ్‌ నారాయణ జాదవ్‌, డిప్యూటీ సర్పంచ్‌ శంకర్‌, నాయకులు సంజు, కేశు రాథోడ్‌, ఉమేష్‌ లాల్‌, గులాబ్‌ సింగ్‌, మధు రాథోడ్‌, శంకర్‌ బనోత్‌, మధు చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.