మనస్తానికి గురై..

– ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య
నవతెలంగాణ-ముదిగొండ
ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామని మనస్తాపానికి గురై ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన వాకదాని వైశాలి(17) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ గజ్జెల నరేష్‌ తెలిపారు. వైశాలి ఖమ్మంలోని ఓ ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసింది. గణితం తప్పడంతో ఆత్మహత్య చేసుకుంది. వైశాలి తండ్రి యుగంధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దొరగారిపల్లెకు చెందిన గటిక తేజస్విని(18) ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయిల్‌ కావటంతో ఉరేసుకుంది.