మిని గురుకుల సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలి..

నవతెలంగాణ – చివ్వెంల: మినీ గురుకుల సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మిని గురుకుల సిబ్బంది  ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె నిర్వహించినారు. ఈ సందర్భంగా మిని గురుకుల ఉద్యోగులు, టీఎస్ యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే మినీ గురుకుల సిబ్బంది డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. సమ్మె చేస్తున్న మినీ గురుకుల ఉద్యోగులకు టీఎస్ యుటిఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ నాయకులు, మినీ గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.