పార్లమెంటులో కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారంమునుగోడు మండల కేంద్రంలో మోడీ ప్రభుత్వానికివ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పంటల మద్దతు ధరలు సహేతుకంగా లేవన్నారు. పెరుగుతున్న వ్యవసాయ వ్యవసాయరైతుల పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలేదు అన్నారు. గత ఏడాది నిర్ణయించిన ధరలపై ఐదు నుంచి ఏడు శాతం మాత్రమే పెంచారని వారు తెలిపారు. అదే సందర్భంలో వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు 20 నుంచి 22 శాతం పెరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి చూపి, దానికి 50 శాతం కలిపి ధరలు ప్రకటించిందని ఆయన అన్నారు. ధరల నిర్ణయాక కమిషన్ రికమండేషన్లను ప్రధాని నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,కేరళ తరహాలో ‘ధరల నిర్ణయాక కమిషన్ ‘( సిఏసిపి) వేసి రాష్ట్రంలో పండే అన్ని పంటలకు మద్దతు ధరలనునిర్ణయించి అమలు చేయాలన్నారు.కూరగాయలతో పాటు పండ్లకు కూడా మద్దతు ధరలు నిర్ణయించాలన్నారు. దీంతోనిర్ణయించిన ధరలను అమలు జరపడం రైతులకు వీలు అవుతుందని ఆయన సూచించారు. ధరలు నిర్ణయించడంతోపాటు నిర్ణయించిన ధరలను అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందురైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలన్నారు.అన్ని పంటలకు బోనస్ కూడా ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో , జిఎం పీస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, వరికుప్పల ముత్యాలు,యా సరాణి శీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, జేరిపోతుల ధనంజయ గౌడ్, హనుమయ్య, జి నరేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.