– ఉపాధి హామీ రోజువారి వేతనం రూ.400కు పెంపు
– యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన
– రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
– అగ్నివీర్ పథకం రద్దు
– రైల్వేల ప్రయివేటీకరణ నిలిపివేత
– రైల్వే చార్జీల తగ్గింపు, వృద్ధులకు రాయితీ
– పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు : కాంగ్రెస్ న్యారుపత్ర-2024 ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. శుక్రవారం నాడిక్కడ ఏ ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ చిదంబరం, ప్రధాన కార్యదర్శి కెేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. న్యారుపత్ర-2024తో పేరుతో 48 పేజీలతో కూడిన ఈ మ్యానిఫెస్టోలో 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను పొందుపరిచారు. యువత, మహిళలు, రైతులు, కూలీలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రైతులకు మద్దతు ధర, నిరుద్యోగంపై దష్టి పెట్టింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ హామీలే తమను ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తాయని, అధికారాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.
– విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు
– విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం
– ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర
– రైతులకు కేంద్రాలలో నేరుగా కనీస మద్దతు ధర
– రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్
– వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
– రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
– నూతన వ్యవసాయ చట్టాలు రద్దు
– ఉపాధి హామీ రోజు వారి వేతనం రూ.400కు పెంపు
– సామాజిక ఆర్థిక సమానత్వం కోసం చర్యలు
– రైల్వేల ప్రయివేటీకరణ నిలిపివేత
– రైల్వే చార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ
– దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ
– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
– సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
– దేశవ్యాప్తంగా కులగణన
– కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ
– 50 శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత
– పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
– కార్మికుల ఆరోగ్యంపై హక్కుల కల్పన
– మూడేండ్లలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ పూర్తి
– నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ప్రతినెలా రూ. పది వేలు
– డిజిటల్ విద్య కోసం తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సెల్‌ఫోన్లు
– పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహం
– రూ.లక్ష (నెలకు రూ.8,500)తో చదువుకున్న యువతీ, యువకులందరికీ ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్
– ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష ఫీజులు రద్దు
– ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ పోస్టుల భర్తీ
– దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీతో హాస్పిటల్ ఏర్పాటు
– యూనివర్శిటీలో వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రోహిత్ వేముల చట్టం
– దేశవ్యాప్తంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కస్తూర్బా గాంధీ పాఠశాలల పెంపు
– సామాజిక న్యాయం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూ.1,000కి పెంపు
– ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హౌదా
– పుదుచ్చేరికి రాష్ట్ర హౌదా
– జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హౌదా పునరుద్ధరణ
– పట్టణాలలో అర్బన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం
– రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
– అగ్నివీర్ పథకం రద్దు. పాత పద్ధతిలోనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావి నియామకాలు
– మహాలక్ష్మి పథకంతో పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం
– రూ.450కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ
– ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు
– అంగన్‌వాడీల సంఖ్య రెట్టింపు, 14 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి
– బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ
– మహిళలకు విద్య, వారి చట్టపరమైన హక్కుల అమలులో సహాయానికి ప్రతి పంచాయతీలో ఒక అధికార మైత్రి నియామకం