కనీస మద్దతు ధర చట్టం చేయాలి..

A minimum support price law should be made.– ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే రాజు డిమాండ్
నవతెలంగాణ – కుభీర్
రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘంఏ ఐ కే ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  జే రాజు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే ప్రజా, రైతు ,కార్మిక నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని శనివారం కుబీర్  మండల కేంద్రంలో  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 13 నెలల ఢిల్లీ రైతు దిగ్బంధనం ముగింపు సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన లిఖితపూర్వక హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు  తాము కస్టపడి పండించిన పంటలకు మాత్రమే గిట్టుబాటు ధర అడుగుతున్నారని, అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతాంగాన్ని ముంచుతూ, కార్పొరేట్ శక్తులకు రైతుల యొక్క రక్త మాంసాలను అమ్మాలని చూస్తున్నదని విమర్శించారు. కార్మికుల, రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్  బైంసా డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్, రైతులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.