‘ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలి’

నవతెలంగాణ-పరిగి
ఆశా కార్యకర్తలు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకష్ణ, ఆశా యూనియన్‌ జిల్లా కార్యదర్శి కే మంగమ్మ అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆశా వర్కర్ల సమ్మె 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్స్‌ పొందిందన్నారు. కనీస వేతనం నిర్ణయం చేయాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శోభ, పద్మ, యశోద, బుడ్డమ్మ, ఉమాదేవి, అరుణ, మధులత, యాదమ్మ, స్వరూప, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.