నవతెలంగాణ – తూప్రాన్
తూప్రాన్ మండలంలో జోరుగా మైనింగ్ మాఫియా కొనసాగుతుందని సమాచారం అందడంతో శనివారం రోజున తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ రోడ్డు మార్గంలోని 44వ జాతీయ రహదారి ప్రక్కన ఓ టిప్పర్ లారీని జిల్లా మైనింగ్ ఏడి ప్రవీణ్ రెడ్డి పట్టుకున్నారు. మైనింగ్ అధికారులు పట్టుకున్న టిప్పర్ లారీ బిల్ పేపర్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న దస్తుతో కూడిన లారీని మైనింగ్ అధికారులు పట్టుకొని 14,439 రూపాయల పెనాల్టీ విధించారు. ఇలాంటి మైనింగ్ అక్రమనలు తూప్రాన్ లో జోరుగా కొనసాగుతున్నట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారు.వీరితోపాటు ఏజీ మధు ఆర్ ఐ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు