
కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం రూ.3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాలలో విద్య బోధన, మౌలిక వసతులపై అరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.