
– ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు ఇచ్చిన మాట నిలుకున్నారు.తాము పొలాల వద్దకు వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని, నిత్యం ఎరువులు, విత్తనాలు, ఇతరాత్ర అవసరాల కోసం వెళ్లాలంటే రోడ్డుపై గుంతలు, ఇరువైపులా ముళ్ల పొదలు ఉండటంతో ఇబ్బందులకు గురివుతున్నామని, ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలు వెళ్ళాక ఎరువులు, విత్తనాలు నెత్తిన ఎత్తుకొని పోతున్న దుస్థితి నెలకొందని, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఇటీవల తాడిచెర్లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు తోళ్లపాయ రైతులు విన్నవించిన విషయం విదితమే. అయితే ఎన్నికల కోడ్ ముగిశాక తప్పకుండా రోడ్డు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు, ఏఎమ్మార్ కంపెనీ సహకారంతో శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని తోళ్లపాయ రోడ్డుకు మరమ్మతుల పనులు ఆప్రాంతంలో వ్యవసాయ భూములున్న రైతులతో కలిసి మరమ్మతుల పనులు ప్రారంభించినట్లుగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మంత్రి సహచరుడు ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ డివిజన్ నాయకుడు మండల రాహుల్, కేశారపు చెంద్రయ్య,కుంట సది,జంజర్ల ప్రశాంత్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు తమ నాయకుడు మాట ఇస్తే తప్పకుండా అభివృద్ధి పనులు చేస్తారని,మాట ఇచ్చి తప్పడం దుద్దిళ్ల కుటుంబంలో లేదన్నారు.ఈ రోడ్డు మరమ్మతులతో శాత్రజ్ పల్లి వరకు సాపిగా వెళ్లవచ్చన్నారు.రోడ్డు వెడల్పు,మరమ్మతులకు రైతులు సహకరీచాలని కోరారు.రోడ్డు పనులతో రైతుల 25 ఏళ్లుగా అనుభవిస్తున్న ఇబ్బందులు తిలగడమే కాకుండా, భూములను సైతం విలువలు పెరుగుతాయన్నారు. మాట ఇచ్చిన ప్రకారం రోడ్డు పనులు చేపట్టిన మంత్రి శ్రీధర్ బాబుకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు.
25 ఏళ్ల కష్టం తొలగనుంది: కామ మొండయ్య రైతు..
25 ఏళ్లుగా రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులకు గురివుతున్నాం.ద్విచక్ర, ఇతర వాహనాలు,ఎడ్లబండి సైతం వెళ్లలేని పరిస్థితి.రోడ్డు పనులు చేపట్టడంతో ఇరువై ఐదు ఏళ్ళ ఇబ్బందులు తొలగనున్నాయి.
పనులు చేపట్టడం సంతోషం: దేవదానం రైతు..
గతంలో రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు,పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.మంత్రి శ్రీధర్ బాబును అడుగగానే ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు మరమ్మతులు చేపట్టడం సంతోషం.పనులు త్వరగా అవుతాయని ఆశిస్తున్నాం.