
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేడు సోమవారం కాటారం డివిజన్ లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని, పలు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తారని మంత్రి సహచరుడు చంద్ర శేఖర్ తెలిపారు. ఉదయం 8 గంటలకు టిఫైబర్ మీటింగ్ హైదరాబాదులో కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 12 గంటలు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాటారం మండలంలోని నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ హాస్టల్ భవనం, ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ క్వార్టర్స్, బర్త్ వెయిటింగ్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మహాదేవపూర్ మండలంలోని నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారని వివరించారు.