నేడు మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల పర్యటన

నవతెలంగాణ – మల్హర్ రావు
నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంథని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్లుగా మంత్రి సహచరుడు చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 8 గంటలకు రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామపంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం  ప్రారంభోత్సవం, 9:30 నిమిషాలకు  మంథని టౌన్ లో గంగాపురి వద్ద నూతనంగా నిర్మించిన ఎస్ఆర్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం, 10 గంటలకు మంథని టౌన్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో నియోజకవర్గ సమస్యలపై రివ్యూ కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 12 గంటలకు  మంథని మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు  ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 1గంటకు కొయ్యూరు నుండి కాటారం మీదుగా మహాదేవపూర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలలో పాల్గొంటారని తెలిపారు.