నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాల వల్ల విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారంనాడాయన బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డిలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణ, సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతటి భారీ వర్షాలు సంభవించినా సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని చెప్పారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్రేక్ డౌన్ అయితే దాన్ని పునరుద్ధరించేందుకు అత్యవసర సిబ్బందిని, మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.