నిజామాబాద్ లో  భరోసా సెంటర్ భవనం ప్రారంభించిన మంత్రి జూపల్లి..

Minister Jupalli inaugurated Bharosa Center building in Nizamabad..నవతెలంగాణ – కంఠేశ్వర్
లైంగిక వేధింపులకు గురైన మహిళలు లేదా బాలికలు భరోసా కేంద్రం ద్వారా వైద్య, పోలీసింగ్, న్యాయపరమైన కౌన్సిల్ తో పాటు వన్ స్టాప్ క్రిసేస్ సెంటర్ గా ఏర్పాటు చేయబడినదే భరోసా సెంటర్ 2016 లో ఏర్పాటైన భరోసా కేంద్రం హైదరాబాద్ కేంద్రంగా సిటి కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహిoచేవారు. ప్రస్తుతం భరోసా కేంద్రాలు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆద్వర్యంలో నడుపబడుతున్నాయి. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు తమ సోషల్ రెస్పాన్స్ లో భాగంగా ఈ భరోసా కేంద్రాలను నిర్వహణ చేపట్టాయి. భరోస కేంద్రాలలో బాధిత మహిళ లేదా బాలికకు వైద్యం, కౌన్సిలింగ్, విద్యాపరంగా, స్వయం ఉపాధి అవకాశాలను సింగిల్ షాప్ కేంద్రంగా పనిచేస్తాయి.రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలు భరోసా కేందాలుగా పలువురికి సేవలు అందిస్తున్నాయి. నిజామాబాద్ భరోసా కేంద్రం 29వ కేంద్రంగా తెలంగాణ ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యలయం పరిధిలో భరోసా సెంటర్ ను ప్రోహిబిషన్  ఎక్సైజ్, టూరిజం కల్చర్  ఆర్కలజి  జిల్లా ఇంచార్జీ మంత్రివర్యులు  జూపల్లి క్రిష్ణా రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్.టి, బిసి మరియు మైనారిటీస్ వెల్ఫేర్ అడ్వైజర్ మహ్మద్ అలీ షబ్బీర్ మరియు రాష్ట్ర డి.జి.పి డా|| జితెంధర్, ఐ.పి.యస్., గారు ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు లైంగిక వేధింపులకు గురైన మహిళలు లేదా బాలికలు మొదటగా పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేసిన అనంతరం వారికి వైద్య సేవలు తదితర శాఖల ఆధ్వర్యంలో న్యాయం చేకూర్చేవారు. దీంతో బాధితులు సరైన సమయంలో స్పందిచడానికి తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసుకోవడానికి కొంత అసౌకర్యాన్ని గురయ్యేవారు కానీ భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా బాధితులు ఒకే కేంద్రంలో అన్ని రకాల సేవలతో పాటు ఆర్ధికపరమైన స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలను సైతం భరోసా కేంద్రం కల్పించనున్నది.2016 నుండి 2024 డిసెంబర్ వరకు భరోసా కేంద్రాల ద్వారా పరిష్కరించబడిన కేసులవివరాలు , ఫోక్సో వంటి కేసులు:6910 ,రేప్ కేసులో: 1770 ,డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అదర్స్ :11663 కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జీ మంత్రివర్యులు మాట్లాడుతూ భరోసా సెంటర్ జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి విషయాన్ని చేర్చే విధంగా చూడాలి అన్నారు. భరోసా కేంద్రాలకు వచ్చే బాధితులకు అన్ని రకాల సేవలు అందించడంతో పాటు మనోధైర్యాన్ని ఇవ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రకారంగా మన మీద ఉన్న దని అన్నారు. అనంతరం భరోసా కేంద్రం విధి విధానాలను బాధితులకు అందించే సహయ సహకారాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యాక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, ఐ.ఎ.ఎస్, ఐ.జి.పి మల్టీజోన్-1 హైదరాబాద్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్., ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీమతి సి.హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్.,, ప్రొబెషనరి ఐ.పి.యస్.,  సాయికిరణ్ పత్తిపాక, ఎమ్. ఎల్.ఎలు  ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (బోధన్), ధన్పాల్ సూర్యనారాయణ గుప్త (నిజామాబాద్ అర్బన్),  రేకులపల్లి భూపతి రెడ్డి ( నిజామాబాద్ రూరల్) రాజకీయనాయకులు తాహేర్ బిన్ అందాన్, వినయ్ రెడ్డి, కేషవేణు, మానాల మోహన్ రెడ్డి,  ఉమెన్ సేఫ్టీవింగ్ ఎస్.పి  అశోక్ కుమార్, డి.యస్.పి పి. శ్రీధర్ మరియు అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. బస్వారెడ్డి  ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.ఐలు ఇతర నాయకులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.