ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం,కల్చర్ అండ్ ఆర్కియాలజీ, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పర్యటించి భీంగల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి కేసులు, కల్లులో కలిపే ఆల్ఫాజోలం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బెల్ట్ షాపులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, గత ప్రభుత్వం ఆదాయం కోసం బెల్ట్ షాపులను ఆదాయ వనరులుగా నడిపించిందని విమర్శించారు. రాబోవు ఐదేళ్లలో జిల్లాతో పాటు బాల్కొండ నియోజకవర్గన్ని అన్ని విధాలుగా, రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్, మానాల మోహన్ రెడ్డి, అలీ షబ్బీర్, భూపతి రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన యావత్ నియోజకవర్గ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు.