అమెరికా పర్యటనకు మంత్రి జూపల్లి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమెరికాకు వెళ్లనున్నారు. ఐమ్యాక్స్‌ అమెరికా 2024 పేరిట లాస్‌ వేగాస్‌ లో నిర్వహించనున్న అతి పెద్ద వాణిజ్య ప్రదర్శనలో మంత్రి పాల్గొంటారు. ఆదివారం దుబారు నుంచి అమెరికా వెళ్లారు.నేడు వాషింగ్టన్‌ డీసీ చేరుకుంటారు. మంగళవారం లాస్‌ ఎంజెల్స్‌, 9,10న లాస్‌ వెగాస్‌, 11న అట్లాంటాలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అమెరికా పర్యటన ముగించుకుని12న భారత్‌ చేరుకొంటారు. తెలంగాణ పర్యాటక రంగానికి కలిసి వచ్చే అంశాలను సద్వినియోగం చేసుకుంటూ దాన్ని కొత్తపుంతలు తొక్కించడం, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన కొనసాగనుంది.