
ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తుందని జిల్లా ఇంచార్జ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని సోమవారం మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీ దగ్గర ప్రోవిబిషన్ ఎక్సైజ్ శాఖ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి, ఎక్సైజ్ స్టేషన్ సిఐ స్టీవెన్ సన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సంక్షేమ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి, స్థానిక శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫైడ్ చైర్మన్ మారా గంగారెడ్డి, సుంకేట అన్వేష్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి, పాలెపు రాజు, డిసి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.