
మానేపల్లి హిల్స్ లో నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని.. భువనగిరి బైపాస్ లోని న్యూవివేర హోటల్ లో వద్ద ఇటీవల ఎన్నికైన మోత్కుర్ మున్సిపల్ ఛైర్మన్ గుర్రం కవితా లక్ష్మీ నర్సింహారెడ్డి, ఇతర కౌన్సిలర్లు మంత్రి వారిని అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కష్టపడి పనిచేయాలని. రాజకీయ ప్రయాణంలో అంతిమ ఫలితం ప్రజల హృదయాల్లో నిలిచిపోవడమేనని. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించాలని ఛైర్మన్ కు సూచించారు. రానున్నది ఎన్నికల సమయమని ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీని వారికి చేరువ చేయాలని మార్గనిర్ధేశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.