త్రిబుల్ ఆర్ బాధితులకు ముఖం చాటేసిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komati Reddy showed his face to the victims of Triple Rనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాదులో ఆయన స్వగృహంలో కలిసి చౌటుప్పల్,భువనగిరి,రాయగిరి,గజ్వేల్  త్రిబుల్ ఆర్ భూనిర్వాసిత రైతులు,ప్లాట్ ఓనర్స్ వందలాది మంది రైతులు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా నార్త్ సైడ్ త్రిపల్ ఆర్ అలైన్మెంట్  నీ ORR నుండి 28 కిలోమీటర్ల కి పరిమితం చేశారని దీనివలన చౌటుప్పల్,భువనగిరి,రాయగిరి, గజ్వేల్ మున్సిపాలిటీలు రెండు మూడు భాగాలుగా విడిపోతున్నాయని, 40 కిలోమీటర్లకు అలైన్మెంట్ మార్చితే మున్సిపాలిటీలు విడిపోకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని, మున్సిపాలిటీల లోని భూముల బహిరంగ మార్కెట్ వాల్యూ సుమారుగా 2-5 కోట్లు, హెచ్ఎండిఏ ప్లాట్లు గజానికి సుమారుగా 20వెలు ఉండగా, ప్రభుత్వం మాత్రం నష్టపరిహారము ఎకరాకి  20 నుంచి 30 లక్షలు, హెచ్ఎండి ప్లాట్లలో గజానికి 5-6 వేలు వరకే ఇస్తా మంటున్నారని, గతంలో ఈ మూడు ప్రాంతాల రైతులు  తమ భూములను ప్రభుత్వ ప్రాజెక్టులు అయిన నేషనల్ హైవేల కోసం, విద్యుత్ స్తంభాల కోసం మరియు నీటి కాలువల కోసం  కోల్పోయామని ఇప్పుడు ట్రిపులర్ వలన ఉన్న కాస్త భూమి కోల్పోతున్నామని  దీనివలన  రైతులు బిచ్చగాళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు.సౌత్ సైడు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్లకు చేస్తున్నట్లుగా  నార్త్ సైడ్ అలైన్మెంట్ ని కూడా శాస్త్రీయబద్ధంగా 40 కిలోమీటర్లుకి మార్చి రైతులకు న్యాయం చేయాలని మనవి చేశారు. తర్వాత  మంత్రి గారు నా చేతిలో ఏం లేదని ముఖ్యమంత్రి గారు అంతా చూసుకుంటున్నారని నన్ను కూడా  ముఖ్యమంత్రి గారు  పిలవట్లేదని చెప్పుకుంటూ బాధ్యతారహితంగా రైతులకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. గతంలో ఎమ్మెల్యే కాకముందు మంత్రి కాక ముందుకు రోడ్డునీ మారిపిస్తారని ఈ అలైన్మెంట్ అన్యాయమని అన్న మంత్రి ఇప్పుడు దీనిపైన స్పందించకపోవడం బాధాకరమైన విషయం అని వాపోయారు. ఆ తర్వాత బాధిత రైతులు మాట్లాడుతూ పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఊర్ల నుండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడానికి వస్తే సరిగ్గా స్పందించకుండా బాధ్యతారహితంగా వెళ్లిపోయాడని, న్యాయం చేయలేని మంత్రి మాకేందుకని, వెంటనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.