
రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుండి మంత్రి బయలుదేరి ఉదయం 8 గంటలకు నల్లగొండ చేరుకొని మునుగోడు రోడ్ లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బక్రీద్ వేడుకల్లో పాల్గొంటారు. 9 గంటలకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఇతర కార్యక్రమాలలో పాల్గొని 11:30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు.