రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ రోడ్డులోని బీట్ మార్కెట్లో సమీపంలో 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు డీసీసీబీ బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న 12 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. 3.10 గంటలకు గంధవారి గూడెం లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను సందర్శిస్తారు. 4.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు.