రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన 

Minister Komati Reddy's visit to the district tomorrowనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 

రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యాహ్న 1:30 గంటలకు నల్లగొండ చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళతారు.