రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన..

Minister Komati Reddy's visit to the district tomorrowనవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : రోడ్డు భవనాలు సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 8:30 గంటలకు నార్కట్పల్లి మండలం  గోపలాయిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో పాల్గొంటారు. అనంతరం 10 : 30 గంటలకు నల్లగొండ చేరుకుంటారు. గురు పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:30 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:45 గంటలకు యాదాద్రి భువనగిరి మండలం మల్లాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ వెళతారు.