నేను కూడా యువజన కాంగ్రెస్ నుండే మంత్రి స్థాయికి వచ్చానని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. నిజాంబాద్ రూరల్ నియోజవర్గ పలు రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు శంకుస్థాపనలకు విచ్చేసిన సందర్భంగా వారికి బొకేతో సన్మానం చేయడం జరిగిందని వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..వచ్చే స్థానిక ఎలక్షన్లో యువకులే ముఖ్య పాత్ర పోషించాలని మంత్రి అనడం జరిగిందని అన్నారు.నేను కూడా యువజన కాంగ్రెస్ నుండే మంత్రి స్థాయికి వచ్చానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జక్రాంపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోప్పరీ వినోద్ , బోర్గం ఆకాష్ రెడ్డి, నరేందర్, లింగం, లక్ష్మణ్, కాంగ్రెస్ కార్యకర్తలు యువజన నాయకులు పాల్గొన్నారు.