మృతుల కుటుంబాలకు మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణ పరిధిలోని వివిధ కారణాలతో మృతి చెందిన రెండు కుటుంబాలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించారు. 17 వ వార్డు ఆర్జాలబావిలో గాదరి గోపమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం పంపించారు. బుధవారం మందడి శ్రీనివాసరెడ్డి గాదరి గోపమ్మ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  పంపిన రూ.10 వేలను ఆ కుటుంబానికి అందజేశారు.
యువకుని కుటుంబానికి ఆర్థిక సహాయం..
నల్గొండ పట్టణం 37 వార్డుకి   యువకుడు కొండూరు నితిన్   ఆకస్మిక మరణించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి ఈ విషయాన్నీ మంత్రి కోమాటిరెడ్డి వెంకట్ రెడ్డి,నల్గొండ మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి  దృష్టికి  తీసుకెళ్లి  వారి కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కార్యక్రమంలో కొలనుపాక రవికుమార్, సురిగి మారయ్య, ఆయితరాజు శివ,కర్నాటి పవన్ గుమ్మడవెల్లి కార్తీక్, అజయ్ పాల్గొన్నారు.