రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం అమెరికా పర్యటనకి బయలుదేరారు. బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యం అవుతున్న ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు అమెరికా వెళ్తున్న మంత్రి. ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ నెల 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ తో సమావేశం కానున్నారు.