క్రీడా ప్రాంగణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం మంత్రి కేటిఆర్ క్రీడా ప్రాంగణ పనులకు శంకుస్థాపన చేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అన్నారు. యువతకు క్రికెట్, వాలిబాల్ వంటి తదితర ఆటలను ఆడుకోవడానికి ఈ క్రీడా ప్రాంగణాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.ఈయన వెంట సర్పంచ్ బండారి సంజీవులు,ఎంపిపి కౌడి రవి,జెడ్పిటిసి బత్తుల రమాదెవి నారాయణ,ఎఎంసి చైర్మన్ పుల్గం సాయిరెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కపిల్ రెడ్డి, పార్టి మండల అద్యక్షులు మద్ది మహెందర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.