నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఊసరవెల్లి (రంగులుమార్చే) చీరను తయారు చేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ ను మంత్రి కే తారక రామారావు అభినందించారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసిన దివంగత నల్ల పరంధాములు కుమారుడు నల్ల విజయ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రసంసించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఊసరవెల్లి చీరను ఆవిష్కరించారు. గతంలో విజయ్ సుగంధాలు వెదజల్లే చీరను తయారు చేశారని తెలిపారు. ఇలాంటి ప్రయోగాలతో రాష్ట్ర ప్రఖ్యాతి ఖండాంతరాలు దాటుతుందని అన్నారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడువిజయ్ ను మంత్రి సన్మానించారు.