నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 119 డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఆ పార్టీ 2018లో రాష్ట్రంలోని 119 సీట్లకు గానూ 118 సీట్లలో పోటీ చేసి 100కు పైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. ఆ పార్టీ దేశ సామాజిక, రాజకీయ పరిస్థితిని బీజేపీ అర్థం చేసుకోలేదని విమర్శించారు. ఖమ్మం సభలో వైరుధ్యాలు, అబద్ధాలు,
పూర్తి అబద్ధాలతో బీజేపీ నేత అమిత్ షా చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజలను ఒప్పించలేకపోయిందని విమర్శించారు. మత, వాక్ చాతుర్యంతో ద్వేషాన్ని జొప్పించడం, అభివద్ధిపై పటిష్టమైన ప్రణాళిక లేకపోవడం, ప్రజల సాధికారతపై భవిష్యత్ దార్శనీకత లేకపోవడం పట్ల బీజేపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.