మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లకు మంత్రి శంకుస్థాపన

నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
ఉప్పుగూడలోని మహంకాళి దేవాలయంలో గల ఖాళీ స్థలంలో అధునాతనమైన జీ ప్లస్‌ 3 మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలో ఇలాంటివి ఇంకా మూడు నాలుగు ఫంక్షనల్లుకు నిర్మిస్తామని తెలిపారు. పాతబస్తీలోని లాల్‌ దర్వాజా, ఉప్పుగూడ, ఛత్రినాక, గౌలిపుర ప్రాంతాలలో చాలామంది హిందువులు ఉన్నారని వాళ్లకు శుభకార్యాలు జరుపుకోవడానికి ఫంక్షన్‌ హాల్‌ లేక బండ్లగూడ, సంతోష్‌ నగర్‌, దూర ప్రాంతాలకు వెళుతున్నారని అన్నారు. అందుకుగాను ఈ ప్రాంతంలో పంక్షన్‌ హాళ్లను నిర్మిస్తామని తెలిపారు. అంతేకాకుండా పాతబస్తీలోని స్మశానవాటికలను కూడా ఆధునికరిస్తామని, బోనాల పండుగ నేపథ్యంలో రోడ్డు, డ్రయినేజీల మరమ్మతులు తొందరగా పూర్తి చేస్తామని అన్నారు. పాతబస్తీకి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా తక్కువేనని అన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రతీ దేవాలయానికి వేల కొద్ది రూపాయలు అభివద్ధికి ఇస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌, ఉప్పుగూడ కార్పొరేటర్‌ సమద్‌ బిన్‌ అబ్ధడ్‌, ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల మాజీ అధ్యక్షుడు రాకేష్‌ తివారి, బీఆర్‌ఎస్‌ కంటెస్టడ్‌ ఎమ్మెల్యే రాఘవేంద్ర రాజు, సిరా రాజ్‌ కుమార్‌, ఆకుల శ్రీనివాస్‌, రాధాకష్ణతోపాటు ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు జనగామ మధుసూదన్‌ గౌడ్‌, కష్ణ తదితరులు పాల్గొన్నారు.