కేటీఆర్‌ను కలిసిన మంత్రి మహేందర్‌రెడ్డి

Minister Mahender Reddy met KTRనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావును రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి మర్యాద పూర్వ కంగా కలిశారు. ఇటీవల పట్నం మహేం దర్‌ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించిన విషయం విధితమే. అప్పుడు కేటీఆర్‌ విదేశీ పర్యటనలో ఉన్న సంగతీ తెలిసిందే. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్‌ను గురువారం మహేందర్‌రెడ్డి ఆయన స్వగహంలో కలిశారు. పరస్ఫరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కష్టానికి ప్రతిఫలంగా మహేందర్‌రెడ్డికి మంచి రోజులు వచ్చాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ అభివద్ధికి కషిచేయాలని సూచించారు. మంత్రి మహేందర్‌రెడ్డితో ఉన్న తాండూర్‌ సీనియర్‌ నాయకుడు కర్ణం పురుషోత్తంరావునుద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ ” మీకూ మంచి రోజులు వస్తాయని” అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు.
మహేందర్‌కు రామకృష్ణగౌడ్‌ అభినందన
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డిని కలిసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ చైర్మెన్‌ ప్రతాని రామకష్ణ గౌడ్‌ కలిశారు. కేసీఆర్‌ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో రామకష్ణ గౌడ్‌ గురువారం బంజారాహిల్స్‌లోని మహేందర్‌రెడ్డి నివాసానికి చేరుకొని బొకేలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రామకష్ణ గౌడ్‌, మంత్రి మహేం దర్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివద్ధికి, ఫిలింఛాంబర్‌కు సహకరించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం లో రామ కష్ణగౌడ్‌ మరువలేని సేవలను అందించారని మంత్రి గుర్తు చేశారు.అంతేగాక తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు సహకరిస్తామని మంత్రి ఆయనతో అన్నారు.