నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు రావడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు రావడానికి సీఎం కేసీఆర్ సంకల్ప బలమే కారణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రమైనా, నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైనా… సీఎం సంకల్ప బలానికి తార్కాణమని పేర్కొన్నారు.