–– ఫెడరేషన్‌కు మంత్రి పొంగులేటీ హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈమేరకు శుక్రవారం అసెంబ్లీలోని తన చాంభర్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బీవీఎన్ పద్మరాజు, సీనియర్ జర్నలిస్టు రాకేష్‌రెడ్డి మంత్రిని కలిశారు. ఈసం దర్భంగా సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలనూ మంత్రితో చర్చించారు. ఇందుకు స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.