నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయంలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతోపాటు ఆ శాఖ బలోపేతానికి కృషి జరుగుతున్నది. అందులో భాగంగానే శనివారం మంత్రి భేటీ కానున్నారు. మంత్రితో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ కావడం చరిత్రలో ఇదే మొదటి సారి కావడం విశేషం.