నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో భద్రాచలం వెళుతున్న గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ పన్నాల శ్రీనివాసరెడ్డి అతిథి గృహంలో ఆయన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మండలంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సిఐ శంకర్ పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఆదివారం కావడంతో మేడారం వెళ్లి ప్రయాణికులకు మంత్రి రాకపోకలతో ఆపివేయడంతో కొంత అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలిపారు.