వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం

Minister Ponnam inspected the arrangements for the vinayaka immersionనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఆదివారం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద మంత్రి పోన్నం ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువు వద్ద లైటింగ్ సిస్టమ్, భారీ కేడ్లు, నిమజ్జనం రోజు ఈతగాళ్లు ఏర్పాట్ల పై  అధికారులకు సూచించారు.  నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు మండప నిర్వాహకులు కూడా సహకరించాలని తెలిపారు. హుస్నాబాద్ ప్రజలపైన ఆదేవుడి ఆశీస్సులు ఉండలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ ఆదేవుడిని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏసీపీ సతీష్, సిఐ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సింగిల్ విండో చైర్మన్  బొలిశెట్టి శివయ్య, పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, వెన్న రాజు, కమిషనర్ మల్లికార్జున్ , కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.