తాగు నీటి సమస్యల పై మంత్రి సీతక్కను కలిసిన మంత్రి పొన్నం 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగు నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చాంబర్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి వినతిపత్రం అందజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రి సీతక్కతో చర్చించారు.