కొత్తగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు గుట్టపై వెలిసిన శ్రీమత్స్యగిరీందరస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు గురువారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.అనంతరం మత్స్యగిరీంద్ర స్వామికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జాతరకు వచ్చేభక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ ఈవో సుధాకర్ కు చైర్మన్ మల్లారెడ్డికి మంత్రి సూచించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లారెడ్డి, ఈవో సుధాకర్, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి,గరిగే ప్రభాకర్,డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.