హుస్నాబాద్ డిపోకు నూతనంగా వచ్చిన రెండు కొత్త ఎక్స్ ప్రెస్ బస్సులను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నూతనంగా వెయ్యి బస్సులు రాబోతున్నాయని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ప్రయాణం పెరిగిందని, బస్సుల్లో అక్యూపెన్సీ పెరిగడం తో కొత్త బస్సులు అవసరం అవుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నామని,ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని తీసుకుపోతామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ జంట నగరాలకు ఇతర ప్రాంతాలకు బస్సు నడిపించడానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ,సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, డి ఎం వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.