వేములవాడలో మంత్రి పోన్నం ప్రభాకర్ పర్యటన..

– పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పొన్నం..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వేములవాడలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురి వివాహ వేడుకల్లో పాల్గొనందుకు వేములవాడ వచ్చారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సత్రంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, అది కార్తీక్ తో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం శుభకార్యాల్లో  పాల్గొని హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.