
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహాత్మా గాంధీ స్ఫూర్తిని మనమంతా కొనసాగించాలని రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణం లో గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. . ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛ కార్యక్రమాల పై మరింత అవగాహనా పెంచుకోవాలన్నారు. హుస్నాబాద్ కు వచ్చిన అవార్డులలో మున్సిపల్ కార్మికుల కృషి ఉందన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు బట్టలు పెట్టి మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకులో రజిత , సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , మునిసిపల్ వైస్ చైర్మన్ అనిత, మునిసిపల్ కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధిలు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.